A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆయిల్ కోసం ఎగబడి..పేలుడులో 62 మంది మృతి
Share |
January 24 2020, 11:13 am

టాంజానియా దేశ రాజదాని ధార్ ఎన్ సలామ్ కు వెస్ట్ లో ఉన్న మొగోరో అనే చోట ఒక ఆయిల్ టాంకర్ పేలగా అరవై రెండు మంది మరణించారు.మరో డబ్బై మంది గాయపడ్డారు. టాంకర్ ప్రమాదానికి లోనుకాగా, పలువురు స్థానికులు పెట్రోల్ తీసుకుని వళ్లడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ఘోరం జరిగింది.ఆయిల్‌ కోసం వచ్చిన ఓ వ్యక్తి సిగరెట్‌ అంటించడంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు. మొదట చమురు టాంకర్ బోల్తా పడింది. అప్పుడు అందులోని ఆయిల్ రోడ్డుమీద పారంది. స్థానికులు చమురు నింపుకొనేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి సిగరెట్‌ అంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్యాంకర్‌లో పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా సజీవ దహనమై మృత్యువాత పడ్డారు.

tags : oil tanker, blast

Latest News
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});