A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు లోకేష్ సలహా
Share |
August 5 2020, 1:51 pm

ఎపిని పేద రాష్ట్రం అని ముఖ్యమంత్రి జగన్ అనడాన్ని టిడిపి నేత,మాజీ మంత్రి లోకేష్ ఆక్షేపించారు. ఎవరైనా తమ బలాలను చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని, కాని తెలుగుదేశం పార్టీపై కోపంతో రాష్ట్రం ప్రగతిని చెప్పుకోకపోతే పెట్టుబడులు రావని ఆయన అన్నారు. డిప్లమాటిక్ అవుట్ రీచ్ కార్యక్రమంలో జగన్ ప్రసంగంపై లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ గత మూడేళ్ళ కాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని, ఆరోగ్య సూచిలో దేశంలో రెండో స్థానంలో ఉందని గర్వంగా చెప్పాలని ఆయన అబిప్రాయపడ్డారు.రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్ లో మొదటి 10 నగరాల్లో మూడు నగరాలకు స్థానం లభించిందని, రెండంకెల వృద్ధి సాధించిందని చెప్పాలని లోకేష్ అన్నారు.. రాష్ట్రంలో అపారమైన నైపుణ్య మానవ వనరులు ఉన్న యువత ఉన్నారనే విషయాన్ని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ చెప్పిందని, గత 5 ఏళ్ళలో 700 కేంద్ర అవార్డులు గెలుచుకుందని, ఇలా మన రాష్ట్రం గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు. ఇవి కాకుండా తమ పార్టీకి ఇన్ని సీట్లు వచ్చాయని జగన్ చెప్పడం సరికాదని ఆయన అబిప్రాయపడ్డారు.
అంటే టిడిపి గురించి బాగా చెప్పి ఉండాలని లోకేష్ అబిప్రాయమా?అయితే గత వ్యాఖ్యలకన్నా ఇది మెరుగ్గానే ఉందని అంగీకరించాలి.
గతంలో తాము కష్టాలలో ఉన్నామని,పేద రాష్ట్రమని, చంద్రబాబు పదే,పదే చెప్పిన విషయాన్ని లోకేష్ మర్చిపోయి ఉండాలి.

tags : lokesh, jagan

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info