A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి బస్ పాస్ లపై 50.km ;ప్రయాణించవచ్చు
Share |
January 22 2020, 7:13 am

ఎపిలో విద్యార్దులు బస్ పాస్ లను ఏబై కిలోమీటర్ ల వరకు వినియోగించుకోవచ్చు.అంటే అంత దూరం లో ఉన్న విద్యార్దులకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నమాట.ఆర్టిసి సబ్ లలో ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని విద్యార్థులు ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటోంది. రాష్ట్రంలో 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే అధిక దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దీని కారణంగా ప్రభుత్వంపై ఏడాదికి 18.50 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.

tags : ap,bus passes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info