A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు మరో కొత్త తలనొప్పి
Share |
January 22 2020, 8:24 am

అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మరి కొద్ది నెలల్లోఎన్నికలు జరగనున్న జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడుఅజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.పార్టీ నేతలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన ఎఐసిసి అదినేతగా కొనసాగుతున్న రాహుల్ గాందీకి ఒక లేఖ రాశారు. వాటిని చూస్తూ భరించలేకపోతున్నానని అందుకే తన పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.కొందరు నేతలు ఎన్నికల పేరుతో డబ్బులు దోచుకుని టికెట్లు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ఇక్కడ కొందరు నేతలకంటే క్రూరమైన నేరగాళ్లే నయమనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు.

tags : congress, jharkhand,resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info