A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పిపిఎలపై వివాదస్పద నిర్ణయమే అయినా..జగన్
Share |
January 22 2020, 8:30 am

విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇది వివాదాస్పదమైన నిర్ణయం అని అంతా అనుకోవచ్చని, అయితే విద్యుత్‌ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలంటే ఇది తప్పదని వివరించారు.డిస్కంలు ఇరవై వేల కోట్ల బకాయిలు పడ్డాయని అదికారులు తనకు వివరించారని, మరి అలా బకాయిలు కొనసాగించాలా అన్నది ఆలోచించాలని జగన్ అన్నారు. వినియోగదారులు, పంపిణీ సంస్థలు, ప్రభుత్వం ఎవరూ నష్టపోకూడదన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నట్లు తెలిపారు. మీరు స్థాపించబోయే పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం కావాల్సిన అర్హతలు తెలుసుకొని స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info