A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టెండర్లకు కొత్త వ్యవస్థ-ఎపిలో జ్యుడిషియల్ కమిషన్
Share |
January 27 2020, 9:09 am

ఎపి ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశం టెండర్ల పరిశీలనకు ఏర్పాటు చేయతలపెట్టిన జ్యూడిషియల్ కమిషన్ కు ఆమోదం తెలిపింది.టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్ద పీట వేయడానికే ఈ బిల్లు తెస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ దీని గురించి చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లు అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని మంత్రివర్గం అభిప్రాయపడింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్ల సరిశీలన జరగడం కోసం ఈ బిల్లు తెస్తున్నారు. రూ.100 కోట్లకు పైబడిన ప్రాజెక్టులను జ్యుడిషియల్‌ కమిషన్‌ పరిధిలోకి తీసుకురావాలని.. జడ్జికి సహాయంగా నిపుణులను అందివ్వాలని నిర్ణయించింది. టెండర్ల విషయంలో జడ్జి సిఫార్సులను సంబంధిత శాఖ తప్పనిసరిగా పాటించాలనే విధంగా చట్టం చేయనున్నట్లు పేర్కొంది.

tags : ap,judicial commission

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info