A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేష్ పై టిడిపి మాజీ ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణ
Share |
December 15 2019, 7:29 am

టిడిపి అదినేత చం్రబాబు నాయుడు ను ఆయన కుమారుడు లోకేష్ నిండా ముంచారని టిడిపి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం బిజెపిలో చేరిన అన్నం సతీష్ ప్రభాకర్ విమర్శించారు.
లోకేష్‌ మంత్రిగా వ్యవహరించిన ఐటీశాఖలో భారీగా ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై విచారణ జరగాలని, రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని ఆయన చెప్పారు. కేంద్రంతో కూడా మాట్లాడి సీబీఐ విచారణ జరమని ఫిర్యాదు చేస్తానని అన్నారు. లోకేష్‌ కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయిందని చెప్పారు. లోకేష్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే టీడీపీకి రాజీనామా చేశానని సతీష్‌ వెల్లడించారు. లోకేష్ కారణంగా త్వరలో పార్టీ ఖాళీ కాబోతుందని జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని ఆయన అన్నారు.

tags : satish

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info