విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడ జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. tags : bail cancelled