A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుమారస్వామి చేతులెత్తేసినట్లేనా
Share |
December 15 2019, 7:33 am

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేతులెత్తేసినట్లుగానే ఉంది. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు అలాగే ఉన్నాయి.తాను ఎవరి వద్దకు వెళ్లలేదని, బిజెపి వారు కాని, కాంగ్రెస్ వారు కాని తనవద్దకే వచ్చారని ఆయన అన్నారు. గత ఏడాదిన్నరగా తన ప్రభుత్వంపై బిజెపి కుట్ర చేస్తూనే ఉందని ఆయన అన్నారు.ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం వంటి ముఖ్యమైన అంశాన్ని వదిలేసి అధికారం కోసం భాజపా తొందరపడుతోంది. మీకు సంఖ్యాబలం ఉన్నప్పుడు ఈ రోజే బలపరీక్ష పెట్టాలని ఎందుకు పట్టుబడుతున్నారు. మీకు ఈ సీటు కావాలంటే తీసుకోండి. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో తొందరేం లేదు. సోమవారం లేదా మంగళవారం వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. నేనేమీ సీఎం అధికారాలను దుర్వినియోగం చేయను. అయితే అంతకంటే ముందు దీనిపై చర్చ జరపండని ఆయన వ్యాఖ్యానించారు.తనకు బలం లేదన్న విషయాన్ని ఆయన అంగీకరించినట్లే అనుకోవాలి.

tags : kumaraswamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info