A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విద్యుత్ ఒప్పందాల నష్టం 5497 కోట్లు- జగన్ వెల్లడి
Share |
December 15 2019, 8:44 am

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవసరం లేకపోయినా అనవసరం గా ఎక్కువ రేటుకు కొనుగోలు చేసిన విద్యుత్ కొనుగోళ్ల మొత్తం సుమారు 5497 కోట్ల వరకు ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.తమ పై బురద వేయవద్దని చంద్రబాబు అంతకుముందు అనగా, తమ అధికారులపై అక్కసుతో చంద్రబాబు మాట్లాడారని జగన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలిసే దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఏ సంవత్సరం అవసరం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు చేసింది సంవత్సరాల వారీగా వివరాలు ఇచ్చారు. 4.84 రూపాయలకు విండ్ కంపెనీల నుంచి విద్యుత్ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకుందని,కాని అదే సమయంలో దర్మల్ విద్యుత్ రేటు 4.20కే అందుబాటులో ఉంటే ఈ విండ్ పవర్ కొన్నారని ఆయన అన్నారు. ధర్మల్ పవన్ ప్లాంటు లను నిలిపివేసి మరీ విండ్ మిల్ల్ నుంచి కొనుగోలు చేశారని జగన్ వెల్లడించారు.2016 నుంచి 2018 వరకు ఈ కొనుగోళ్లు జరిగాయని ఆయన అన్నారు.వీటన్నటిలో స్కామ్ ఉందని ఆయన అన్నారు. కేవలం మూడు కంపెనీల నుంచే సౌర విద్యుత్ కొన్నారని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రెన్యువల్ ఎనర్జీ ని ప్రోత్సహించినందుకు 500 కోట్ల సాయం కేంద్రం నుంచి వస్తే, మనకు జరిగిన నష్టం 5500 కోట్ల నష్టం భరిస్తారా అని ఆయన అన్నారు.

tags : jagan, power rates

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info