రూ.5 కోట్ల పనికి రూ.137 కోట్లా? అని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్న విషయాలు సంచలనం కలిగించేవే. గాలేరు–నగరి తొలి దశలో 29వ ప్యాకేజీలో రూ.171 కోట్లకుగాను రూ.166 కోట్ల పని 2014 నాటికే పూర్తయిందని.. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మిగిలిన రూ.5 కోట్ల విలువైన పనిని 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్ నుంచి విడదీసి దాని వ్యయాన్ని రూ.137 కోట్లకు పెంచి, రాజ్యసభ సభ్యుడి సంస్థకు అప్పగించి ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి అనిల్‌కుమార్ చెప్పారు. టీడీపీ సర్కార్ హయాంలో మొత్తం 268 పనులను 60సీ నిబంధన కింద విడదీస్తే ఇందులో రూ.1,600 కోట్ల విలువైన పనులను రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు నామినేషన్ పద్ధతిలో, టెండర్ నిబంధనలు మార్చి అప్పగించారని ఎత్తి చూపారు. tags : anil