‘రాష్ట్రంలో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్ ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని 2014 జూలైలో అప్పటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. చెప్పిన మొత్తం కంటే ఐదేళ్లలో అదనంగా రూ.16 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఒక్క గేటు అమర్చే డ్రామాకే చంద్రబాబు రూ.2.30 కోట్ల ఖర్చుతో ప్రకటన ఇచ్చారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తవ్వుతున్న కొద్దీ చంద్రబాబు అవినీతి, అక్రమాలు, సినిమాలు, వీడియోలు, యాడ్లు బయట పడుతున్నాయన్నారు. tags : anil yadav