A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారంటే
Share |
December 15 2019, 8:28 am

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన మతలబు పై వస్తున్న వార్తలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు కంగారు పడుతున్నారో ఇప్పుడు అర్దం అవుతోంది. గతంలో ఆనాటి సి.ఎస్.దినేష్ కుమార్ విద్యుత్ ను ప్రైవేటు సంస్థ లనుంచి ఇష్టం వచ్చినట్లు కొనవద్దని పైల్ లో రాసినా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదట.పవన విద్యుత్‌ కొనుగోలును అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్, అప్పటి ఆర్థిక శాఖ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారి మాటల్ని ఖాతరు చేయని చంద్రబాబు 2017 సెప్టెంబర్‌ 9న కేబినెట్‌ సమావేశం నిర్వహించి.. అధిక ధరకు (యూనిట్‌ రూ.4.84) పవన విద్యుత్‌ కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. 2017 సెప్టెంబర్‌ 9న చంద్రబాబు నిర్వహించిన కేబినెట్‌ సమావేశం అజెండాలోని సుజ్లాన్‌ అండ్‌ యాక్సిస్‌ నుంచి పవన విద్యుత్‌ కొనుగోలు వ్యవహారం బట్టబయలు చేస్తోంది.




‘రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉంది. మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొత్తగా.. అదికూడా యూనిట్‌ రూ.4.84 చొప్పున పవన విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ కేబినెట్‌ ఫైలులో స్పష్టం చేశారు. డిస్కమ్‌లు ఇప్పటికే రూ.2 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని, అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేస్తే మరింత భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం డిస్కమ్‌లకు ఆత్మహత్యా సదృశమే అవుతుందన్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే పవన, సౌర విద్యుత్‌ దొరుకుతున్న నేపథ్యంలో గతంలో కుదుర్చుకున్న పీపీఏలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయినా.. చంద్రబాబు సర్కారు విద్యుత్‌ కొనుగోలు చేసి డిస్కమ్‌లను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని కదనం వచ్చింది.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info