తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే, నాలుగేళ్లపాటు ఇక ఏ ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఈ ఎన్నికల తర్వాత పూర్తిగా పరిపాలనపైనే దృష్టి కేంద్రీకృతం అవుతుందని ఆయన చెప్పారు. అధికార, రాజకీయ అవినీతిని ఏ స్థాయిలోనూ సహించేదిలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినట్టేనని, మిగిలిన కొన్ని పనులు వాటికవే జరిగిపోతుంటాయని అన్నారు. ఇకపై కృష్ణానదీ జలాల వినియోగంపై దృష్టిసారిస్తామని, పాలమూరు ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దామని ఆయన అన్నారు. tags : kcr