A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్రజ్యోతి రాదాకృష్ణపై కాపు నేతల ఫైర్
Share |
December 15 2019, 7:35 am

టిడిపి కాపు నేతలు కొందరు తూర్పు గోదావరి జిల్లా కాకినాడులో మళ్లీ సమావేశం అయినట్లు సమాచారం వచ్చింది. అందులో పాల్గొన్న నేతలు కొందరు ఆంద్రజ్యోతి ఎమ్.పి రాదాకృష్ణపై ఆరోపణలు చేశారని వార్త.రాధాకృష్ణ చెప్పినవారికే టిడిపి సీట్లు , కోట్ల డబ్బు ఇచ్చారని వారు అబిప్రాయపడ్డారట. లోకేశ్‌ తన సొంత సామాజిక వర్గానికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని నేతలు విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌లు కాపులను అవమానంగా చూసేవారని వారు భావిస్తున్నారు. సూటు బూటు వేసుకున్న వారికే లోకేశ్‌ ఎక్కువ సమయం కేటాయించే వారని కూడా వారు అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం నేతల కంటే కమ్మ సామాజిక వర్గం వారికే పార్టీ ఫండ్‌ ఎక్కువగా ఇచ్చారని వారు ఆరోపించారని మీడియాలో కదనం వచ్చింది. ఎవరు ఈ ఆరోపణలు చేశారో కాని టిడిపిలో కాపు వివాదం ముదురుతోందని అనుకోవాలి.

tags : ap,kapu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info