A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి రాజధాని భవనాలలో శ్వాసకోశ సమస్యలు
Share |
December 15 2019, 7:38 am

టిడిపి ప్రభుత్వం కన్నా, రాజదాని నిర్మాణానికి తామే అదిక మొత్తం కేటాయించామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి చెప్పారు. గత ప్రబుత్వం కేవలం రెండువందల కోట్లు కేటాయించిందని, తాము 500 కోట్లు ఇస్తున్నామని ఆయన అన్నారు.కేంద్రం ఇచ్చిన 1500 కోట్లను ఖర్చు చేసి అప్పటి ప్రభుత్వం భవనాలు నిర్మిస్తే ఎంత అద్వాన్నంగా ఉన్నాయో చూస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐదువేల రూపాయలకు ఒక అడుగు నిర్మిస్తే, ఇక్క డ మాత్రం అడుగుకు పన్నెండువేల రూపాయలు వ్యయం చేశారని బుగ్గన చెప్పారు.ఇంతా చేస్తే ఈ భవనాలకు కిటికీలు లేవని, దాంతో ఇక్కడ పనిచేస్తున్న అదికారులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కుంటున్నారని, ఆ విషయం అదికారులే చెబుతున్నారని బుగ్గన వివరించారు.ఇక్కడ వర్షం కురిస్తే బయట కన్నా, భవనాలలోనే వర్సం ఎక్కువ నీరు ఉంటోందని ఆయన తెలిపారు.

tags : buggana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info