ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతి అంశాన్ని వివాదం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. సభలో ఎక్కడ కూర్చోవాలనే విషయంలో కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ‘నిబంధనల ప్రకారమే శాసనసభలో సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా’ అని ముఖ్యమంత్రి అన్నారు. కావాలనే టిడిపి ఎమ్మెల్యేలు వివాదాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఒక ప్రశ్న పూర్తి అయిపోయిన తర్వాత మరో ప్రశ్న పై చర్చ జరుగుతుంటే, టిడిపి నేతలు లేచి మొదటి ప్రశ్న గురించి ప్రస్తావిస్తున్నారని ఆయన అన్నారు. tags : jagan