A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
Share |
December 15 2019, 8:14 am

ఆంద్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.ఒడిషా కు చెందిన నేత విశ్వభూషణ్ హరిచందన్ ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.గత కొంతకాలంగా దీనిపై ఊహాగానాలు వచ్చాయి. అయితే సుష్మ స్వరాజ్ వంటివారికి అవకాశం రావచ్చనుకున్నారుకాని విశ్వభూషన్ కు ఈ పదవి దక్కింది.ఇటీవలే విజయవాడలో స్టేట్ గెస్ట్ హౌస్ ను రాజ్ భవన్ గా ఎపి ప్రభుత్వం ప్రకటించి అవసరమైన మార్పులు చేసింది.దీంతో ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ బాద్యతలు పూర్తి అయినట్లే. కాగా నరసింహన్ ను తెలంగాణ నుంచి మార్చి మరో బాద్యత అప్పగించవచ్చని అంటుననారు.1937 లొ జన్మించిన హరిచందన్ మూడుసార్లు భువనేశ్వర్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.గతంలో బిజెపి ఒడిషా అద్యక్షుడుగా ఉన్నారు.కొంతకాలం ఆయన జనతా పార్టీలో ఉన్నా తిరిగి 1996నుంచి బిజెపిలో ఉన్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.

tags : viswa bhushan harichandan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info