A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
Share |
August 21 2019, 5:17 pm

‘అవినీతి అన్నది ఉండకూడదని పదేపదే చెప్పానని, ఎమ్మార్వో కార్యాలయాల్లో గానీ, పోలీస్‌స్టేషన్లలో కాని ఎక్కడా కూడా ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా? అవినీతి నిర్మూలనపై మనం ఇచ్చిన సందేశం బలంగా నాటుకు పోయిందా? లేదా అని జిల్లా కలెక్టర్ లను ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ఎక్కడా కూడా అవినీతిని సహించబోమని స్పష్టంచేయాలని.. ఈ విషయంపై కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశాన్ని ఇవ్వాలని సూచించారు. కూకటి వేళ్లతో అవినీతిని పెకలించి వేయాలని..ఈ మేరకు తన స్థాయిలో తాను గట్టిగా ప్రయత్నిస్తున్నానని.. దయచేసి అధికారులంతా అవినీతి నిర్మూలనపై దృష్టిపెట్టాలని కోరారు. లంచం లేకుండా నేను పనిచేసుకోగలిగాను అని ప్రజలు అనుకోవాలని, పోలీస్‌ స్టేషన్‌కు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా వెళ్లామనే భావన ఉండేలా పని చేయాలని సూచించారు. అదే విధంగా గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి కలెక్టర్లతో సీఎం మాట్లాడుతూ.. మూడు జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలుకారణంగా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అంశాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

tags : jagan

Latest News
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info