విద్యుత్ పిపిఎ లను పునఃపరిశీలన విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు వణికిపోతున్నారని వైసస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.ఆయన ఆయా అంశాలపై ట్వీట్ చేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ఈ విమర్శలేంటి చంద్రబాబు గారూ. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. జగన్ గారు అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని శోకాలు పెడుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసు.
సోలార్, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ప్రభుత్వం పున:పరిశీలన చేస్తానంటే మీరెందుకు వణికిపోతున్నారు చంద్రబాబు గారూ. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల ఏటా 2,500 కోట్ల ప్రజాధనం వృధా అయింది. యూనిట్ 2.70కి వస్తుంటే 4.84 చెల్లించారు. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారు?
ఆయుష్ మంత్రిత్వ శాఖ పనితీరుపై ఈరోజు రాజ్య సభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాలను మెరుగుపరచడానికి ప్రభుత్వానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడం జరిగిందని కూడా ఆయన వివరించారు. tags : vijayasaireddy