A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
Share |
December 15 2019, 8:20 am

స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో ఒక మాట చెప్పించారు. ఒక వివాదంలో స్పీకర్ ను ఉద్దేశించి టిడిపి ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మీరు రాసిస్తే చదువుతా అని వ్యాఖ్యానించారు.దీనిపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడు చంద్రబాబును ఉద్దేవించి తమ్మినేని ప్రశ్నిస్తూ,మీరు రాసిస్తే నేను చదువుతా అని అచ్చెన్నాయుడు అనడాన్ని సమర్దిస్తారా అన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. అచ్చెన్నాయుడి మాటలను సమర్థించడం లేదని చెప్పక తప్పలేదు.అయితే అదే సమయంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాటలను మీరు సమర్థిస్తారా అంటూ స్పీకర్‌ను అడిగారు. ఇలా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే సభ నడిచే పరిస్థితి ఉండదని, సభను హుందాగా నడిపించేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.కాగా అచ్చెన్నాయుడు సంప్రదాయాలు మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి అన్నారు. స్పీకర్‌ను కూడా బెదిరించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇన్ని రోజుల్లో ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదని అచ్చెన్నాయుడు అన్నారు.

tags : tammineni seetaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info