A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వినోద్ కుమార్ కు పదవి
Share |
July 18 2019, 8:11 am

టిఆర్ఎస్ మాజీ ఎమ్.పి బోయినపల్లి వినోద్ కుమార్ కు తెలంగాణ లో పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయనను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడిగా నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేబినెట్‌ హోదాతో కొనసాగారు. వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నిరంజన్‌రెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తొమ్మిది నెలలుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి భర్తీ కాలేదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికలలో ఓడిపోయిన వినోద్ సేవలకు గుర్తింపుగా, ఆయన అనుభవాన్ని వాడుకోవడానికి ఈ పదవి ఇవ్వవచ్చని చెబుతున్నారు.

tags : vinod

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info