A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చాలా సినిమా ముందు ఉంది -మంత్రి అనిల్ యాదవ్
Share |
July 18 2019, 8:35 am

ఇప్పటికి నలభై రోజుల పాలనే అయిందని,చాలా సినిమా ముందు ఉందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో చేసిన దోపిడీ చాలా దారుణంగా ఉందని ఆయన అన్నారు. కపడ జిల్లాలో ఒక ప్రాజెక్టు పది కోట్ల వ్యయం నుంచి 130 కోట్ల కు పెంచేశారని ఆయన ఆరోపించారు. అన్ని విషయాలు బయటకు వస్తాయని, ప్రాజెక్టులలో జరిగిన అంచనాలను ఇష్టం వచ్చినట్లు పెంచారని, వాటన్నిటిని సమీక్షిస్తున్నామని ఆయన అ్నారు.టిడిపి ఎమ్.పిలకు,ఎమ్.పిలు గా పోటీచేసిన నేతలు ఈ రకమైన కాంట్రాక్టులు పొందారని ఆయన అన్నారు. అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీ సహించలేకపోతోందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో ప్రతి ఒక్కరితో తగాదా పెట్టుకుని రాస్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన చరిత్ర వారిదని ఆయన అన్నారు. వారి ట్రాక్ రికార్డు చూస్తే ఎవరితోను పూర్తిగా శాశ్వతంగా స్నేహం చేయలేదని ఆయన అన్నారు.గోదావరి జలాలను సాగర్ ,శ్రీశైలం ప్రాజెక్టులకు తీసుకు వళ్లే ప్రతిపాదన ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని ఆయన అన్నారు.

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info