A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రిగారి కొడుకుపై లంచం కేసు
Share |
July 18 2019, 8:38 am

పశ్చిమబెంగాల్ లో కట్ మనీ వివాదం ముఖ్యమంత్రి మమత బెనర్జీ క్యాబినెట్ ను కూడా తాకింది.ఆమె క్యాబినెట్ లో పుడ్ ప్రాసెసింగ్,ఉద్యానవన శాఖ ల మంత్రి అబ్దుల్ రజాక్ కుమారుడు ముస్తాక్ అహ్మద్ తమ నుంచి ఏడు లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.గత కొంతకాలంగా టి.ఎమ్.సి.ని ఈ విషయం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.ఒక భూమి వివాదం పరిష్కరించానికి ఒక వ్యక్తి నుంచి ఐదు లక్షలు తీసుకున్నారని,కోల్డ్ స్టోరేజీ కి ప్రభుత్వ సబ్సిడీ ఇప్పించడానికి మరో వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారని అబియోగం . అయితే ఆ ఆరోపణలను ముస్తాఖ్ ఖండించారు. వారు తమ స్వార్ద ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

tags : west bengal, cut money

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info