A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిపిఎం అడిగిన పని మమత చేసేశారు
Share |
July 18 2019, 8:17 am

రాజకీయాలు ఎలా మారుతాయో చూడండి.కొంతకాలం క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం లకు ఉప్పు,నిప్పులా పరిస్థితి ఉండేది. ఇప్పుడు బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా రూపాంతరం చెందుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ అదినేత్రి, ముఖ్యమంత్రి మమత బనర్జీ సిపిఎం వారిని దువ్వడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.గత ఎనిమిదేళ్లుగా సిపిఎం కు సంబందించిన పైల్ ను క్లియర్ చేయడానికి ఆమె ఒకే చేశారు.లెప్ట్ ప్రంట్ చివరి నాలుగు నెలల్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జ్యోతిబసు స్మారకం నిర్మించడానికి ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి సిపిఎం కు అప్పగించడానికి నిర్ణియించి అందుకు అయ్యే వ్యయం నాలుగున్నర కోట్లు కూడా చెల్లించింది.కాని అంతలో ప్రభుత్వం మారిపోయి తృణమూల్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చి మమత ముఖ్యమంత్రి అయ్యారు.దాంతో ఈ పైల్ పక్కన పడిపోయింది.అయితే ఇటీవల తనకు సిపిఎం, కాంగ్రెస్ లు సహకరించాలని,బిజెపిపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపు ఇచ్చారు.ఈ నేపధ్యంలో జ్యోతిబసు 106వ జయంతి సందర్భంగా సిపిఎం నేతలు కొందరు మమతను కలిసి ఈ భూమి విషయం గురించి ప్రస్తావించారు.దాంతో ఆమె వెంటనే క్లియర్ చేయాలని సంబందిత శాఖను ఆదేశించారు. జ్యోతిబస్ 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.ఆయన పేరుతో స్మారకం నిర్మించి ,మ్యూజియం ఏర్పాటు చేయాలని ,కాన్ఫరెన్స్ హాలు నిర్మించాలని తలపెట్టారు.

tags : cpm,mamata

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info