A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి తిరోగమనంలో ఉందంటున్న చంద్రబాబు
Share |
July 18 2019, 8:34 am

ఎపిని ముఖ్యమంత్రి జగన్ తిరోగమనంలో నడిపిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన టిడిపి శాసనసభ పక్ష సమావేశంలో ప్రసంగించారు.టిడిపి హయాంలో చేపట్టిన అబివృద్ది పనులన్నిటిని నిలిపివేశారని ఆయన అన్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉండి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బురద జల్లినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక ప్రజా ప్రయోజనం దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ కొనసాగించారని.. సీఎం జగన్‌ మాత్రం అయోమయంతో, అవగాహనారాహిత్యంతో మొత్తం వ్యవస్థలనే దెబ్బతీస్తున్నారని ఆయన అ్నారు.ప్రభుత్వం పాలనపై కాకుండా ,టిడిపి నేతలు,కార్యకర్తలపై టార్గెట్ పెట్టిందని ఆయన ఆరోపించారు.

tags : chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info