A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు అవగాహన లేదట
Share |
July 18 2019, 8:09 am

రైతుల రుణాలపై వడ్డీలు గత ప్రభుత్వం కట్టలేదని ముఖ్యమంత్రి జగన్ చేసిన సవాల్ కు అసెంబ్లీలో సిద్దపడని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బయట మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రి కి విషయం తెలియదని విమర్శించడం విశేషం.ఏడాదికి మూడువేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని జగన్ లెక్క కట్టి మరీ చెబితే తాము ఏడాదికి 175 కోట్లు బడ్జెట్ లో పెట్టామని ,గతంలో బడ్జెట్ ప్రసంగాలను చదివి వినిపించారు.. జగన్‌కు అసలు విషయంపైనే అవగాహన లేదు. 2014-15 నుంచి 2017-18 వరకు రూ.930 కోట్ల వడ్డీలేని రుణాలు చెల్లించాం. 43లక్షల 70వేల మందికి ఈ మొత్తాన్ని అందజేశాం. 2018-19కి మాత్రమే రూ.560 కోట్లు పెండింగ్‌ ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. తమపై జగన్ బురద చల్లే పనిలోనే ఉంటున్నారని ఆయన అన్నారు.మొత్తం ఐదేళ్లకు కలిపి 930 కోట్లు ఇచ్చామంటున్నారు. ఏడాదికి మూడువేల కోట్లు కావల్సి ఉంటే 930 కోట్లు ఎలా సరిపోయాయో!

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info