A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయిపై టిడిపి లేఖ
Share |
July 18 2019, 8:55 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పై అనర్హత వేటు వేయాలని టిడిపి కోరింది.టిడిపి ఎమ్.పిలు రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ కు దీనిపై లేఖ రాశారు.
కేబినెట్‌ హోదాతో దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని , దిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతోనే విజయసాయి రాజ్యసభ సభ్యత్వానికి అర్హత కోల్పోయారన్నారు.ఇది లాభదాయక పదవి కిందకు వస్తుందని వారు పేర్కొన్నారు. అయితే అనర్హత వేటు పడుతుందనే జులై 4న రాష్ట్ర ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకుందని, ఆ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారని తెలిపారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.

tags : vijayasai ,letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info