A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఎమ్మెల్యే విజ్ఞప్తికి జగన్ ఓకే
Share |
July 18 2019, 8:11 am

ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి జగన్ ఆయన డిమాండ్ కు సానుకూలంగా స్పందిచడం విశేషం. గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తన నియోజకవర్గంలో పోలవరం కుడికాల్వ నుంచి గోదావరి జలాల్ని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని కోరారు. గత నాలుగేళ్లుగా సొంత ఖర్చులతో 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించానని, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందని ఆయన వివరించారు. అప్పటి వలేనే విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ విజ్ఞప్తి చేశారు.ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారి సమాచారం.

tags : tdp,jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info