A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును టిడిపి ఎమ్మెల్యే ఇరికించారా
Share |
July 18 2019, 8:12 am

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును టిడిపి ఎమ్మెల్యే ఇరికించినట్లయింది.కరువు ప్రకటనపై జరిగిన చర్చలో టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తాము సున్నా వడ్డీ పదకాన్ని రైతులకు తెచ్చారని అంటున్నారని, కాని ఆ స్కీమ్ కిరణ్ కుమార్ రెడ్డి టైమ్ లో ఆరంభించారని, ఆ తర్వాత చంద్రబాబు టైమ్ లో కొనసాగించారని అన్నారు. దానిపై అదికార పక్షం అభ్యంతరం చెప్పింది.ఈ దశలో ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని 2014 నుంచి 2019 వరకు ఎంత మొత్తం ఈ పధకం కింద ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. రికార్డులు తాను తెప్పిస్తానని, సున్నా పదకాన్ని అమలు కాలేదని రుజువు చేస్తే రాజీనామా చేసిపోతారా అని సవాల్ చేశారు.అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ ఎపిలో వ్యవసాయాన్ని నెంబర్ ఒన్ చేశామని అన్నారు.ఏ ప్రభుత్వానికి అయినా ఒక విధానం ఉంటుందని అన్నారు. రికార్డులు మీవద్దే ఉంటాయని అన్నారు.మంత్రి బుగ్గన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన సవాల్ కు నేరుగా సమాదానం ఇవ్వాలని సూచించారు అయితే రామానాయుడు మాత్రం మళ్లీ తమ ప్రభుత్వం సున్నా వడ్డీ చెల్లించామని అన్నారు.అప్పుడు జగన్ జోక్యం చేసుకుని రికార్డులు తెప్పిస్తామని రుజువు చేయాలని సవాల్ చేశారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ తాను చెప్పలేదని, జగన్ తమను అవమానిస్తున్నారని అన్నారు. క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని అంటారా అని ప్రశ్నించారు. మీరు ఏమీ మాట్లాడినా పడాలా అని ప్రశ్నించారు.

tags : ap assembly

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info