A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో కరువు తీవ్రంగా ఉంది- ముఖ్యమంత్రి
Share |
July 18 2019, 8:59 am

ఎపిలో కరువ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటన చేశారు. సాధారణఃగా జూన్ లో 130 మిల్లీ మీటర్ల మేర వర్షం నమోదు అవుతుంటుందని, కాని ఈసారి డెబ్బై మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసిందని ఆయన చెప్పారు. పంటల విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయిందని,కేవలం 3.8 లక్షల హెక్టార్ల మేర మాత్రమే విత్తనాలు వేశారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కునడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.తాను అధికారంలోకి వచ్చి నలభై రోజులే అయిందని, అయినా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు.2013 లో కరవు, తుపానులు వచ్చాయని, అప్పటి ఎన్నికలలో అదికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్పినా , ఆ పని చేయలేదని, రెండువేల కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని ఎగవేసిందని జగన్ అన్నారు.గడచిన ఐదేళ్లలో తీవ్రమైన కరువు వచ్చిందని, గత ఏడాది ఖరీప్ లో కరువు ను ఎదుర్కోవడానికి 1800 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని జగన్ అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.ఈ ఖరీప్ కు అవసరమైన విత్తనాల సేకరణను కూడా గత ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు.

tags : ap,draught

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info