A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు త్పుడు సమాచారం ఇస్తున్నారు
Share |
July 18 2019, 8:43 am

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని మాజీ ఎమ్మెల్యే ,బిసి సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య సరిపడా లేదనే సాకుతో 4వేల సర్కారీ బడులను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టకుండా, తెలంగాణలో రాజస్థాన్‌ ఫార్ములా అమలుకు సిద్ధమవడం సిగ్గుచేటన్నారు. కొందరు అధికారులు పాఠశాలలపై సీఎం కేసీఆర్‌కు తప్పుడు సమాచారం అందిస్తూ పేదలకు విద్యను అందని ద్రాక్షగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

tags : r krishnayya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info