A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి వాళ్లకు సమాచారం లీక్ చేసేవారట
Share |
July 18 2019, 8:12 am

సిబిఐ దాడి చేసి కేసు నమోదు చేసిన జిఎస్టి సీనియర్ అదికారి బొల్లినేని శ్రీనివాస్ గాందీకి సంబందించి పలు ఆసక్తికర కదనాలు వచ్చాయి. ఆంగ్ల మీడియాలో వచ్చిన కొన్ని వార్తల ప్రకారం గాంధీ హై ప్రొఫైల్ కేసులను హాండిల్ చేసిన తీరుపై సిబిఐ పలు విషయాలను కనుగొంది. కులం,ప్రాంతం, పార్టీ ఆదారంగా ఆయన కేసులు డీల్ చేశాడని వెల్లడైంది. ప్రత్యేకించి తన కులం వారికి ఉపయోగపడేలా,టిడిపికి చెందిన వారికి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించాడని సిబి భావిస్తోంది. జిఎస్టి కేసులో సుజనా చౌదరి గ్రూప్ కు సమాచారం లీక్ చేసేవాడని సిబిఐ కనుగొన్నట్లు సమాచారం. అంతేకాక ఆయా వ్యక్తులకు పేవర్ చేయడానికి గాను అసలు సీరియస్ కేసులను పక్కన పెట్టి వారిపై చిన్న కేసులు పెట్టి వ్యవహారాన్ని పక్కదారి పట్టించేవారట. అంతేకాక తన భార్య భాగస్వామిగా ఒక కన్సల్టెన్సిని ఏర్పాటు చేసి లంచాల మార్గం తయారు చేసుకున్నారట.

tags : cbi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info