A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేల రాజీనామా-సుప్రింకోర్టు కీలక ఆదేశం
Share |
July 18 2019, 8:58 am

కర్నాటక కాంగ్రెస్ ,జెడిఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడంపై సుప్రింకోర్టు స్పందించింది.ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు స్పీకర్ వద్దకు వెళ్లి వివరణ ఇవ్వాలని , దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం రేపు తెలియచేయాలని కూడా కోర్టు కోరింది.ఎమ్ఎల్యేల రాజీనామాలను వివాదం చేయడం ఆశ్చర్యంగా ఉందని వారి తరపు న్యాయవాది రోహత్ ముద్గల్ అన్నారు.దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ, తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని వ్యాఖ్యానించారు. కేసును రేపు విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది.తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డిజిపి రక్షణ కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది.

tags : supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info