A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా అనుభవం అంత లేదు జగన్ వయసు
Share |
October 16 2019, 8:07 pm

తన రాజకీయ అనుభవం అంత ముఖ్యమంత్రి జగన్ వయసు ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నీ తనకే తెలుసునని అనుకున్నట్లు వ్యవహరించరాదని అన్నారు. గోదావరి నీటి మళ్లింపుపై జగన్ చాలా తేలికగా మాట్లాడారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే జగన్ గతంలో భారత్,పాకిస్తాన్ లు అవుతాయని జగన్ అన్నారని, ఇప్పుడు మాట మార్చుకున్నారని చంద్రబాబు అన్నారు.తన నోరు అసెంబ్లీలో మూయించవచ్చేమో కాని, బయట మూయించలేరని అన్నారు. భావితరాల భవిష్యత్తును తాకట్టు పెట్టే అదికారం ఎవరికి లేదని చంద్రబాబు అన్నారు.మంత్రి బుగ్గన జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నేత ఎందుకు ఆవేశ పడుతున్నారని ప్రశ్నించారు. గోదావరి పాయల నుంచి ఎంత నీరు వచ్చేది చెబుతుంటే టిడిపి ఎమ్మెల్యేలు నోళ్లు వెళ్లబెట్టుకుని విన్నారని ఆయన అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ను తెలంగాణ ప్రభుత్వం కట్టింది,ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం నడుపుతన్నట్లేనని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ అప్పుడు మాట్లాడారని, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని బుగ్గన అన్నారు. తాను అదికారంలో ఉన్నప్పుడే ఇవన్ని జరిగాయని చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూ బాబ్లిపై పోరాటం చేశామని, ఆల్ మట్టిపై ముఖ్యమంత్రుల కమిటీ ని ఏర్పాటు చేశామని అన్నారు. ట్రిబ్యునల్ లో మిగులు జలాలు అవసరం లేదని వైఎస్ హయాంలో లేఖ ఇచ్చారని ఆయన అన్నారు.

tags : chandrababu, jagan

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info