A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ విశాల హృదయంతో..జగన్ వ్యాఖ్య
Share |
July 18 2019, 9:01 am

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎలా వెళతారని టిడిపి ఉప నేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.దీనికి జగన్ సమాదానం ఇచ్చారు.ఐదేళ్ల పాటు వాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టును కడుతుంటే ఇక్కడ చంద్రబాబు గారు ఏ గాడిదలను కాశారని జగన్ ప్రశ్నించారు.తాను వెళ్లినా,వెళ్లకపోయినా, అక్కడ ప్రాజెక్టు ప్రారంభించేవారని ఆయన అన్నారు. టిడిపి అదికారంలో ఉన్నప్పుడే ఆల్ మట్టి ప్రాజెక్టు కట్టారని,చంద్రబాబు చక్రం తిప్పుతున్నప్పుడే ఆ డామ్ కట్టారని, అది అయిన తర్వాత కృష్ణా నదిలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు బాగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు. 1100 టి.ఎమ్.సి ల నీరు రావల్సి ఉండగా, ఐదారువందల టి.ఎమ్.సి ల నీరు తగ్గిపోయిందని ఆయన చెప్పారు. ఆల్ మట్టి ఎత్తు పెంచడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ తో ఉన్న సత్సంబధాల వల్ల విశాల హృదయంతో ముందుకు వచ్చి గోదావరి నీళ్లను శ్రీశైలం తీసుకురావడానికి,సాగర్ కు తీసుకు రావడానికి ప్రయత్నం జరుగుతోందంటే అబినందించవలసింది పోయి విమర్శిస్తారా అని జగన్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న నీటిని ఇవ్వడానికి కెసిఆర్ ముందుకు వచ్చారని ఆయన అన్నారు.

tags : jagan,kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info