A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి అసెంబ్లీలో రెండు కీలక బిల్లులు
Share |
October 16 2019, 8:53 pm

ఎపి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపద్యంలో ముఖ్యమంత్రి జగన్ సభలో పెట్టవలసిన బిల్లులపై అదికారులతో చర్చించారు.మొత్తం 12 బిల్లులు పెట్టాలని అబిప్రాయపడ్డారు.ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని, న్యాయ శాఖతో సమన్వయంతో బిల్లులను రూపొందించాలని అధికారులను కోరారు. ఆయా బిల్లులపై మంత్రులు, అధికార సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేశారు.
కౌలు రైతులు, శాశ్వత బీసీ కమిషన్‌.. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం తదితర అంశాలపై రూపొందించే చట్టాల విషయమై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రతి బిల్లులో ప్రభుత్వ ఉద్దేశాలు, తీసుకురాబోతున్న చట్టాల వల్ల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం కలగబోతుందన్న అంశాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానికంగా ఉపాధికి ఊతం
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో మాట్లాడారు. ఈ చట్టం పకడ్బందీగా ఉండాలని, ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగత్రలు తీసుకోవాలని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఈ విషయంపై వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ చట్టం కార్యరూపం దాలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి రోజులు
ఇప్పటికే మంత్రివర్గంలో 60 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించడమే కాకుండా ఎస్సీ మహిళకు హోం శాఖను అప్పగించి ఇప్పటికే ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వర్గాలకు నామినేషన్‌ పదవులు, ఐదు లక్షల రూపాయలలోపు నామినేషన్‌ పనుల్లో 50 శాతం కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు.

tags : assembly ,bills

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info