A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి ఎమ్మెల్యే లేఖ
Share |
July 18 2019, 8:50 am

పోలవరం కాల్వ కింద మోటార్లతో సాగు చేసే రైతులను సాయం చేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మోటార్లతో పొలాలకు నీళ్లు పెట్టుకునే అవకాశం కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించాలన్నారు. వైఎస్‌ హయాంలో పోలవరం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ ప్రారంభమైంది..2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించే ప్రయత్నం చేశారని లేఖ లో పేర్కొనడం విశేషం.

tags : vamsi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info