A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కోణంలో ఎపిని చూడకండి..వైసిపి
Share |
July 18 2019, 9:00 am

ఎపిపై కరుణ చూపాలని ప్రధాని మోడీని కోరుతున్నానని రాజమండ్రి ఎమ్.పి మార్గాని భరత్ అన్నారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోణంలో రాష్ట్ర ప్రజలను చూడవద్దని ఆయన ప్రధానిని కోరారు. ఎన్నికల్లో ఆయన్ను ప్రజలు ఓడించారని, గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ సంక్షోభంలో ఉందన్నారు. దీనిపై టీడీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎపి ఆర్దిక సంక్షోభంలో ఉందని జీతాలు ఇవ్వడం కూడా కష్టం గా మారిందని ఆయన అన్నారు. గాయపడిన ఆంధ్రను ప్రేమతో, కరుణతో జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ప్రత్యేక హోదా ప్రకటించాలి. విభజన హామీలను చేయాలి. రెవెన్యూ లోటు భర్తీ నిధులివ్వాలి. 13జిల్లాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, దుగరాజపట్నం రేవు, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. 2014లో మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని భరత్ గుర్తు చేశారు.

tags : yco mp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info