A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకేషే కొంప ముంచారన్న టిడిపి ఎమ్మెల్సీ
Share |
July 18 2019, 7:53 am

లోకేష్ వల్లే ఎపిలో తెలుగుదేశం ఓడిపోయిందని పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ఆరోపించారు. కనీస అర్హత లేని లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. లోకేష్‌ రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయారని, అడ్డదారిలో మంత్రిపదవి కట్టబెట్టారని సతీష్ పేర్కొన్నారు.లోకేష్‌ పార్టీలోకి వచ్చిన తరువాత గ్రూపులను తయారుచేశారని, హెరిటేజ్‌ సంస్థలా పార్టీ తయారైందని అన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎప్పడో చచ్చిపోయిందని ఆయన అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కేతో కలిసి చట్టసభల్లో కూర్చోడానికి లోకేష్‌కు సిగ్గుండాలని ఘాటుగా విమర్శించారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సతీష్‌ సవాల్‌ విసిరారు.

tags : annam satish

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info