A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
66వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది-బుగ్గన
Share |
July 18 2019, 8:34 am

గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో వృద్ది రేటు గణనీయంగా తగ్గిందని, కాని చేపలు, గొర్రెలు,పశువులు వంటి రంగాలలో పెరిగిందని, అందువల్ల వ్యవసాయంలో పెరిగామని గత ప్రభుత్వం చూపిందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు.చేపల ఉత్పత్తి పెరిగితే వ్యవసాయం పెరిగినట్లు అవుతుందా?అని ఆయన ప్రశ్నించారు. బుగ్గన తొలి వాస్తవ పత్రం విడుదల చేశారు.ఒక వక్క వ్యవసాయం లో వృద్ది రేటు గత ప్రభుత్వం అదికంగా చూపిందని, మరో వైపు కరువు కూడా అదికంగా ఉన్నట్లు చెబుతూ వచ్చిందని ఆయన అన్నారు.దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గితే, ఎపిలో మాత్రం విపరీతంగా పెరిగి దరల పెరుగుదలకు దారి తీసిందని, దీనివల్ల నష్టం జరిగిందని ఆయన అన్నారు.విభజన వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చని,కాని లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి వ్యయానికి ఖర్చు చేయలేదని, దానివల్ల ప్రతిఫలం రాలేదని, మౌలికవసతులు,ప్రాజెక్టులకు, మానవ వనరుల అబివృద్దికి ఖర్చు చేయవలసి ఉందని, కాని అలా జరిగినట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు.2004-2009 మద్య దేశంతో పాటు ఎపి వృద్ది రేటు బాగుందని ఆయన చెప్పారు.ఎపి ఒకప్పుడు రెవెన్యూ మిగులుగా ఉన్న రాష్ట్రం క్రమేపి రెవెన్యూలోటు రాష్ట్రంగా మార్చారని, ఇప్పుడు అరవై ఆరువేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. ద్రవ్యలోటు 2006-2007 లో 1.8 గా ఉందని, అది ఇప్పడు 2.6 కి పెరిగిందని ఆయన అన్నారు.

tags : buggana,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info