A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మోసాన్ని కాపులు గుర్తించారు
Share |
July 18 2019, 7:57 am

మాజీ మంత్రి ,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. చంద్రబాబు చేసిన మోసాలను గమనించిన కాపులు టిడిపి పాలన అంతం చేయడానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఓటు వేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు.అందువల్ల కాపులకు రిజర్వేషన్ లు కల్పించాలని ముద్రగడ కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడం కోసం తెదేపా అధినేత చంద్రబాబు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చారని, ఆయన గెలుపు కోసం కాపు సామాజిక వర్గమంతా పోరాడితే తెదేపా ప్రభుత్వం అరాచక పాలన చేసిందని లేఖలో పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు అప్పట్లో కేంద్రం పది శాతం రిజర్వేషన్ కల్పించింది. అందులో సగం కాపులకంటూ చంద్రబాబు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకొన్నారు ఆయన తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో బీసీ సర్టిఫికెట్ అడుగుతుంటే అలాంటి అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారని, కాపులు చంద్రబాబు మోసాన్ని గమనించి ఆయనను ఓడించారని ముద్రగడ పేర్కొన్నారు.

tags : mudragada

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info