A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దివాళా తీసిన కంపెనీకి పోలవరం ప్రాజెక్టా
Share |
July 18 2019, 8:39 am

దివాళా తీసిన ట్రాన్స్ స్ట్రాయ్ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులోని సబ్ కాంట్రాక్టులను తన ఇస్టం వచ్చినవారికి ఇచ్చిందని నిపుణుల కమిటీ నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.దీంతో పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని కధనం. ప్రధాన గుత్తేదారుతో ఒప్పందం రద్దయితే ఇక సబ్ కాంట్రాక్టర్ లకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని సూచించినట్లు చెబుతున్నారు.గత ప్రబుత్వం చేసిన కొన్ని అవకతవకలపై పోలవరం ప్రాజెక్టులో కీలక మైన అదికారులను నిపుణుల కమిటీ ప్రశ్నించిందని సమాచారం.

పోలవరం గుత్తేదారుకు ప్రత్యేక నిధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. అధికారుల ఆధ్వర్యంలోనే చెల్లింపులు చేపట్టింది. ఒప్పందంలో అలాంటి వెసులుబాటు ఏమీ లేకుండా చెల్లింపులు ఎలా జరిపారని కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది.
ప్రస్తుతం పోలవరంలో కాంట్రాక్టర్ తో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో ముందస్తుగా చేసిన చెల్లింపుల మొత్తాలను రికవరీ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ఉల్లంఘనలు జరిగాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యమైనది కాబట్టి పనులు ఆగకుండా త్వరితగతిన జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది.

tags : polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info