A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మాత్రం తెగ బాదపడుతున్నారు
Share |
July 18 2019, 7:58 am

ఎపిలో జనం బాధపడుతున్నారో లేదో కాని, ఎపి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎన్నో బాధలు కనిపిస్తున్నాయి.నెలలోనే ఇన్ని సమస్యలా అని ఆయన అంటున్నారు.టిడిపి మీడియాలో ఈ వార్తలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో వేరుసెనగ విత్తనాల పంపిణీతో పాటు విద్యుత్‌ సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. ఆరు నెలల గడువిచ్చి ప్రభుత్వ పనితీరును నిర్మాణాత్మకంగా పరిశీలిద్దామనుకున్నాం. నేడు ఆ పరిస్థితి లేదు. టిడిపి సానుభూతిపరులైన చౌకదుకాణాల డీలర్లను, మధ్యాహ్నభోజన ఏజెన్సీలను, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డగోలుగా తొలగించేందుకు స్థానిక నాయకులు ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు దిగడం ఎంతవరకు సమంజసం? పోలీసులు పార్టీలకతీతంగా పనిచేయాలి. వారు ఇలాగే వ్యవహరిస్తే ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చంద్రబాబు హెచ్చరించారని కధనం వచ్చింది.

tags : chandrababu,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info