A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మీ నాన్నే ఒక విష సర్పం- లోకేష్ కు రిప్లై
Share |
July 18 2019, 7:59 am

మాజీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలను అనకాపల్లి వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ తీవ్రంగా ఖండిచారు. ఆయన మాట్లాడుతూ ‘మీ నాన్న ఓ రాజకీయ విష సర్పం. ఎన్నికల్లో ఆ సర్పం కోరలు ప్రజలే పీకేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో చేయలేని పనులను కేవలం నలభై రోజుల్లో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలే కారణం. విద్యుత్ బకాయిలు ఒక్కొక్కటి మా ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తోంది. వచ్చే ఏడాదికి కోతలు లేకుండా చేస్తాం. రైతులకు విత్తనాల సరఫరాలో విఫలమైందని ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మే నెల వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి, రైతులు ఇబ్బందులు పడతారన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేద’ని ప్రశ్నించారు.

tags : amaranath

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info