A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఏభై వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి
Share |
July 18 2019, 8:41 am

ఎపిలో గత ప్రభుత్వం హయాంలో ఆర్ధిక వ్యవహారాలలో జరిగిన గందరగోళాన్ని సరిదిద్దడం ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.గత చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఏభై వేల కోట్ల మేర బిల్లులను పెండింగులో పెట్టి అప్రాదాన్యత పనులకు, ఓట్ల కొనుగోలు పదకాలకు ఖర్చు చేసిందని వెల్లడవుతోంది.ఆర్ధిక నిపుణులు, ప్రభుత్వంలోని ముఖ్యమైనవారు ఆర్ధిక పరిస్థితిపై అద్యయనం చేసినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చాయని సమాచారం.ఏభైవేల కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉంచారని,వాటిలో ఆస్పత్రి బిల్లులు,విద్యుత్ సంస్తలకు ఇవ్వవలసిన బకాయిలు మొదలైనవి ఉన్నాయట. ఈ పరిస్థితిపై వాస్తవ పత్రం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తం ఏడు శ్వేతపత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

tags : ap,bills

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info