A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
Share |
July 18 2019, 8:07 am

గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు నిజాయితీ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండరాదని ఆయన అన్నారు.జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పై స్థాయి నుంచి మీ వరకు ,అక్కడ నుంచి కింద వరకు ఎక్కడా అవినీతి ఉండరాదని అయన అన్నారు. ప్రతి స్థాయిలో పారదర్శక ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అది ఎలా ఉండాలంటే దేశ స్థాయిలో ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం వైపు చూడాలని జగన్ అన్నారు.ప్రజలకు అందవలసిన సేవలకోసం లంచాలు ఇవ్వవలసిన దుర్గతి పట్టరాదని, చెప్పులు అరిగేలా ప్రజలు తిరగవలసిన అవసరం రాకూడదని ఆయన అన్నారు. ఇది మన ప్రభుత్వం అని ఆయన అన్నారు. ప్రజలకు ఏమి కావాలన్నా లంచాలతో అనే పరిస్థితి నుంచి బయటపడాలని, వాళ్లు ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మారాలని ఆయన అన్నారు. మన పనితీరు ఆదారంగానే ఓట్లు వేస్తారని ఆయన అన్నారు.నా పనితీరు,మీ పనితీరు అంతా కలిపే చూస్తారని జగన్ స్పష్టం చేశారు.

tags : bribes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info