A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డాలస్ లో ఉత్సాహంగా యోగా
Share |
May 25 2020, 8:36 pm

డాలస్, టెక్సాస్: ఇర్వింగ్ నగరంలో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టొఫర్ ముఖ్య అతిధి గాను, కాన్సుల్ రాకేష్ బనాటి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.

సంస్థ కార్యదర్శి రావు కల్వల అతిధులకు స్వాగతం పలికి, యోగా చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. సంస్థ ఉపాధ్యక్షుడు బి.ఎన్ రావుమాట్లాడుతూ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్రధాన వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యోగా అనే ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప కానుక గా వర్ణిస్తూ, యోగా చేయడానికి వయస్సు, జాతి, మతం, కులం అడ్డు కావని అందుకే 170 దేశాలకు పైగా కోట్లాది ప్రజలు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారని అన్నారు. యోగా సంవత్సరానికి ఒక సారి వచ్చే పండుగలా గాక దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు. ఈ యోగాను ఇర్వింగ్ నగరంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని ఇర్వింగ్ మేయర్ కు సూచించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

ఇర్వింగ్ నగర్ మేయర్ రిక్ స్టొఫర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఎన్నో దేశాల ప్రజలు యోగా ను తమ జీవితాలలో ఒక ముఖ్య భాగంగా చేసుకోవడం విశేషమని, యోగాను ఆవిష్కరించిన భారతదేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాన్సుల్ రాకేష్ బనాటి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అనుసరించి ఐక్యరాజసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించటంతో ప్రపంచవ్యాప్తంగా యోగా జరువుకోవడం భారతదేశానికి గర్వకారణం అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, డాలస్ విద్యార్థులకు మహాత్మా గాంధీ మెమోరియల్ సంస్థ 2,000 డాల్లర్ల స్కాలర్షిప్ ను యూనివర్సిటీ ఏషియా సెంటర్ డైరెక్టర్ మోనిక్ వేడేర్బర్న్ కు మేయర్ చేతుల మీదుగా అందజేశారు.

“92వ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలలో” విజేతలుగా నిలిచిన అభిజాయ్ కొడాలి, సోహుమ్ సుఖతన్కర్, రోహన్ రాజాలను, వారి తల్లిదండ్రులను డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు, మేయర్ రిక్ స్టొఫర్, కాన్సుల్ రాకేష్ బనాటిలు ఘనంగా సత్కరించారు.

దాదాపు రెండు గంటల పాటు యోగా గురువులు విజయ్, పెగ్గీ నేతృత్వంలో యోగాలోని మెళకువలను ఉత్సాహంగా ప్రవాస భారతీయులు నేర్చుకొని సాధన చేశారు.

సంస్థ కోశాధికారి అభిజిత్ రాయిల్కర్ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులకు, విచ్చేసిన అతిధులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసిన వారికి, వాటర్ బాటిల్స్ ఉచితంగా అందజేసిన సరిగమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన వారందరికీ గాంధీ మెమోరియల్ సంస్థ వారు యోగ్యతా పత్రాలను, అల్పాహారం అందజేశారు.

tags : yoga,dallas

Latest News
*తెలంగాణలో కెసిఆర్ ను పవన్ ఎదిరిస్తారా
*చంద్రబాబు పూలు చల్లించుకున్నారు
*పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు
*ఎపి కి చంద్రబాబు -ఈనాడు,సాక్షి కధనాలు
*రేపటి నుంచి విమానాలు పెరుగుతాయి
*నా స్థాయి నుంచి అవినీతి ఆస్కారం ఉండరాదు-జగన్
*10240 మందికి పరీక్షలు-44 మందికి కరోనా
*లోకేష్ ,విజయసాయిల వ్యాఖ్యల్లో హుందాతనం ఏది
*కెసిఆర్ , జగన్ లు క్లారిటీతోనే ఉన్నారా!
*మళ్లీ టిడిపి నేత కూన రవికుమార్ దూషణలు
*నవరత్నాలు కాదు..నవమోసాలు-యనమల
*ఎల్లోమీడియా దుష్ప్రచారం -మంత్రి
*అప్పుడు సిబిఐ నే రావద్దన్నారుగా
*కరోనాపై ఎపిలో అసాదారణ విజయం
*విజయనగరం ఎమ్మెల్యే రాజీనామా సవాల్
*వర్షాలు పడేవరకు ఎండలే తీవ్రం..జాగ్రత్త
*uఎపిలో మూడు లక్షలకు చేరిన కరోనా పరీక్షలు
*విద్యుత్ కొత్త బిల్లు-సిపిఎం నిరసన
*ఎపిలో వ్యవసాయ సలహా మండళ్ల జిఓ
*చంద్రబాబు ఎందుకు ఎపికి వచ్చారంటే..
*ఈ ఎమ్.పి వైసిపికి ద్రోహం చేయడం లేదుకదా!
*టిటిడి ఆస్తుల గొడవ- సుబ్బారెడ్డి వివరణ
*చంద్రబాబుకు వైసిపి ఎమ్.పి సవాల్
*సుప్రింకోర్టు-ఇంగిత జ్ఞానం-మినహాయింపు!
*మద్యం వినియోగం బాగా తగ్గించాం-జగన్
*దేశచరిత్రలోనే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదేమో-జ.గన్
*విమాన యానం-గందరగోళం
*జయ రక్త సంబంధీకురాలిని -వారసురాల్ని కాదా
*అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గుతోంది
*వానాకాలం నుంచి పంటల పూర్తి వివరాలు
*టి. నీటి ప్రాజెక్టులపై ఎపి సమాఖ్య పిర్యాదు
*టిటిడి ఆస్తుల అమ్మకం తీర్మానం 2015లోనే
*4 లక్షల మందికి ఉద్యోగాల ఘనత జగన్ దే
*కెటిఆర్ వచ్చాకే చేనేత కు ఆదరణ పెరిగింది
*తెలంగాణలో కరోనా లెక్కల అయోమయం
*చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు అయిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info