A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
Share |
October 22 2019, 2:03 am

విజయవాడ, అమరావతి చుట్టూ రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతోందని రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. ‘అమరావతిలో రింగ్‌ రోడ్డు అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌కు తాము ఏనాడో ఆమోదం తెలిపామని మంత్రి చెప్పారు. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణ జరగనందున పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ ఖర్చును నూరు శాతం భరించడానికి తొలుత అంగీకారం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఈ వ్యయంలో 50 శాతం కేంద్రమే భరించాలని కోరింది. ఈ ప్రతిపాదనకు మేం అంగీకరించాం. కొత్త ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ముందుకు వస్తే ఎంవోయూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.

tags : center, ring road

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info