A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెంబర్ ఒన్ పోలీసింగ్ అంటే ఇలాగా..జగన్ ప్రశ్న
Share |
July 18 2019, 8:43 am

ఎపిలో పోలీసింగ్ వ్యవస్థ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. నెంబర్ ఒన్ పోలిసింగ్ అంటే ఇసుక మాఫియాలను చూస్తూ ఊరుకోవడమా?అక్రమ మైనింగ్ జరుగుతుంటే పట్టించుకోకుండా ఉండడమా? ఒక మహిళా ఎమ్.ఆర్.ఓ.ని స్వయంగా ఒక ఎమ్మెల్యేనే వేదిస్తే కేసు పెట్టకుండా ఉండడమా అని ఆయన అన్నారు. ఎస్పిల సమావేవశంలో ఆయన మాట్లాడుతూ రెండు లక్షల మంది ఎన్నుకునే ఎమ్మెల్యేలను గౌరవించాలని ఆయన సూచించారు.అయితే అదే సమయంలో అక్రమాలను అనుమతించనవసరం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి. సమస్య ఉందని ఎవరైనా మన వద్దకు వచ్చినప్పుడు వారి బాధను ఓపిగ్గా వినాలి. సానుకూలంగా వింటే 50శాతం సమస్య పరిష్కారమైనట్లే అని ఆయన అన్నారు. ఎప్సి లు కూడా చిరునవ్వుతో పలకరించాలని ఆయన సలహా ఇచ్చారు. స్నేహపూర్వక పోలీసింగ్ ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ లలో రిసెప్షన్ విభాగాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

tags : jagan, police

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info